గోషామహల్‌ లో గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో నిరసన

గోషామహల్‌ నియోజకవర్గంలోని బేగంబజార్‌ డివిజన్‌ చూడి బజార్లో చౌరస్తాలో బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ కేంద్రం పెంచిన గ్యాస్‌ ధరకు నిరసనగా మహిళలు , బిఆర్‌ఎస్‌ నాయకులు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు.
గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఖాళీ సిలిండర్లు , మహిళలతో నిరసన వ్యక్తం చేశారు .గ్యాస్‌ ధరలు తగ్గించాలని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ ధరలు తగ్గించే వరకు బిఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌ నాయకులు గణేష్‌ , వెంకటేష్‌ , హెచ్‌ కుమార్‌ , శివశంకర్‌ , తెంపు , మహిళ నాయకురాలు భారతి , సురేఖ , సుమతి , రాజ్యాలక్షి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking