బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు.. గిరిజన వైద్య విద్యార్థిని ప్రీతి నాయక్ హత్య సహా రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా ఐడిపిఎల్ చౌరస్తా వద్ద బిజెపి ఆధ్వర్యంలో నిరసన ర్యాలి ని చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీ చింతల్ నుండి ఐడిపిల్ వరకు నిర్వహించిన ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ పలు కళాశాల విధ్యార్ధులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు మాట్లాడూతూ.. రాష్ట్రంలో నేరాల కంటే.. అత్యాచారాలే ఎక్కువగా ఉన్నాయని, అత్యాచారాల శాతం 23 శాతానికి పెరిగిందని అన్నారు.మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై రాష్ట్ర ప్రభుత్వమే భాద్యత వహించాలని డిమాండ్ చేసారు.సిరిసిల్లలో ఆరేండ్ల చిన్నారి పై అఘాయిత్యం చేస్తే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని, లక్షలాది సిసి కెమెరాలు అమర్చి నేరాలపై నిఘా పెట్టమని ప్రభుత్వం గొప్పలు చెప్తున్నా.. ఇంకా ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డా. ప్రీతి హత్యను.. ఆత్మ హత్య గా చిత్రీకరిస్తూ.. ప్రభుత్వం నేరస్తులను కాపాడే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న మహిళల అత్యాచారాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి పై విచారణ చేపట్టి దోషులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, భాగ్యరథి, రాయల్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.