పెరిగిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు డిమాండ్.
ప్రపంచ కుబేరుల్లో ఒకడైన అదాని ఆస్తులు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆదాని ఎక్కడ వెనకబడిపోతాడు అని భయం లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ కుటిల బుద్ధితోనే ఆదానే ఆస్తులు పెంచేందుకే దేశ ప్రజలపై వంటగ్యాస్ ధరలు పెంచారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళి తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం స్థానిక రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ ఎదుట సిపిఐ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సిలిండర్లకు పూజలు చేస్తూ , నెత్తిన పెట్టుకొని మోస్తూ వినూత్నంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు జిల్లా కార్యదర్శి పి మురళిలు మాట్లాడుతూ దేశంలో వంటగ సిలిండర్ రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తగ్గింది లేదన్నారు 2014 సంవత్సరంలో 410 రూపాయలు ఉన్న సిలిండర్ను నేడు 1150 రూపాయలకు తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుందని ఘాటుగా విమర్శించారు బేరల్ రేటు తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గకపోగా వంట గ్యాస్ వినియోగదారుల విపరీతంగా పెరగడంతో ఇదే లాభా పక్షుల గుర్తించిన నరేంద్ర మోడీ ప్రతిసారీ 50 రూపాయలకు తగ్గకుండా పెంచుకుంటూ పోవడాన్ని తప్పుపట్టారు గత ప్రభుత్వాలు వంట గ్యాస్ ధరలను కేవలం నాలుగు రూపాయలు ఐదు రూపాయలు మాత్రమే పెంచేవారని బరితెగించిన నరేంద్ర మోడీ మాత్రం కార్పొరేట్ కనుసన్నల్లో వాళ్ళ ఆలోచన కనుగొనంగా వాళ్ళ మెప్పు పొందే పద్ధతులలో ప్రతిసారి 50 రూపాయలకు తక్కువ లేకుండా పెంచడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో ఎలక్ట్రికల్ బైక్ రేట్లు కూడా అమాంతంగా పెరిగిపోవడంతో వేద ప్రజలకు తీవ్ర అంతరాయం గలుగుతా ఉన్నది. కొనుగోలు శక్తి కూడా పడిపోతున్నది నేడు పెంచిన వంటగ్యాస్ ధరను తగ్గించకపోతే దేశ ప్రజలు మోడీకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు . ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలు వి విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళా అభ్యున్నతే బిజెపి అభ్యున్నత అని చెప్పి ప్రగల్బాలు పలికే మోడీ మహిళల కంట కన్నీరు తీసుకొస్తున్నాడని వారు ఆవేదన చెందారు నిత్యవసర సరుకుల ధరలు కొనలేక తినలేక బాధలు పడుతుంటే మహిళా కంట కన్నీరు మరింత తెప్పించడానికి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచి మహిళలకు మోయలేని భారాన్ని నితిన్ పెడుతున్నాడని మండిపడ్డారు అత్యధిక శాతం మహిళా ఓటర్లతో గద్దికెక్కిన అన్ని ప్రభుత్వాలు మహిళల పట్ల చిన్నచూపు చూడడం మంచిది కాదన్నారు రానున్న రోజుల్లో మళ్లీ మట్టి పొయ్యిలు వెతుక్కోవాల్సిన దుస్థితి రాబోతున్నదని ఆ పొయ్యిలకు కట్టెలు కూడా దొరకలేకుండా మోడీ చేసేసి ఇప్పుడు సిలిండర్లో పెంచుకుంటూ పోతూ జనాన్ని తీవ్రంగా మోసం చేస్తున్నాడని ఈ మోసం ఎంతో కాలం నిలవదని రానున్న 2024 ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని మహిళలు గద్దె దింపుతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య నగర కార్యదర్శి ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాధాకృష్ణ నగర కార్యదర్శి ఎన్ డి రవి మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి బి నదియా వివిధ ప్రజా సంఘాల నాయకులు ఎం రామకృష్ణ కేవై రాజా చిన్నం కాళయ్య , ఏపీ బాల, వైఎస్ మనీ, మహేంద్ర , కె . పద్మనాభ రెడ్డి , జె . నాగరాజు , నవీన్ , ప్రసాద్ , ముద్దు క్రిష్ణ, సి . రత్నమ్మ , ఎన్ మంజుల , విజయ , అలివేలు తదితరులు పాల్గొన్నారు .