ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..నిర్మల్ నియోజకవర్గంలో గ్రామస్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కేఎస్ఆర్ క్యాంపు కార్యాలయంలో నిర్మల్ నియోజకవర్గ మండలాల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిందని తెలిపారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను గ్రామంలో ఇంటింటికి వివరించాలని సూచించారు గ్రామ, మండల, పట్టణంలోని వార్డు కమిటీలను త్వరలో పూర్తి చేయాలని ఆదేశించారు.ప్రజా ప్రభుత్వంలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉండాలని పేర్కొన్నారు.వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు