శ్రద్ధ లేని రైతు వేదికలు.!?

విరిగిన కంచె.. పిచ్చి మొక్కలు పలుచోట్ల దర్శనం

భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి మార్చి 18 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట రైతు వేదికలను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజాధనంతో నిర్మిస్తే.. నేడు వాటిపై ప్రత్యేక శ్రద్ధ లేక వెలవెలబోతున్నాయి గ్రామాలకు రైతులతోపాటు అనేక శుభ కార్యక్రమాలకు ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం ఉపయోగ పడుతున్నటువంటి రైతు వేదికలు సరైన ప్రత్యేక శ్రద్ధ లేక, కనీసం శుభ్రం చేసేవారు సైతం లేకపోవడం, పలు విమర్శలకు తావిస్తోంది. అనేక చోట్ల… పారిశుద్ధ్యం లోపించి దర్శనమిస్తున్నాయి. రైతులకు అవగాహన శిక్షణ ఇవ్వాల్సిన రైతు వేదికలు చెత్తాచెదారంతో నిండిపోతున్నాయి.వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు అనేక మండలాలు వాటి కనసందల్లో ఉన్నటువంటి రైతు వేదికలలో ఇదే పరిస్థితి దాపరించింది. కనీసం తాళం తీసేవారు సైతం లేకపోవడం అనేక వాటికి తాళాలు సైతం లేకపోవడం శోచనీయం. అనేక రైతు వేదికల వద్ద ప్రహరీలు లేక సిమెంటు స్తంభాలతో.. చుట్టూ కంచెను ఏర్పాటు చేస్తే నాసిరకంగా ఏర్పాటు చేశారో ఏమోగానీ ఎక్కడికక్కడ పడిపోయి దర్శనం ఇస్తున్నాయి. అక్కడక్కడ గట్టిగానే ఉన్నాయి. ఇదే పరిస్థితుల్లో అశ్వరావుపేట మండలంలోని… అనంతారం గ్రామపంచాయతీలో ఉన్నటువంటి రైతు వేదిక నందు.. సిమెంటు పోల్స్ విరిగిపోయి చుట్టూ రక్షణగా ఏర్పాటు చేసిన కంచ సైతం పడిపోయి దర్శనం ఇవ్వడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు ప్రజాధనంతో నిర్మించినటువంటి రైతు వేదికలపై ప్రత్యేక దృష్టి నిలిపి సమస్యలను పరిష్కరిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking