మొబైల్ నెట్ వర్క్ ద్వారా జరిగే ప్రచార వివరాలు అందించాలి

జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 18 : లోక్ సభ ఎన్నికలు 2024 లో భాగంగా జిల్లా పరిధిలో వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులకు సంబంధించిన మొబైల్ నెట్ వర్క్ లో బల్క్ ఎస్ ఎం ఎస్ వాయిస్ కాల్స్ మెసేజ్లు ద్వారా చేసే పూర్తి ప్రచార వివరాలను అందించాలి జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లోగల సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సబావత్ మోతిలాల్ కలిసి వివిధ మొబైల్ నెట్వర్క్ ప్రతినిధులతో ప్రచార సంబంధిత అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…లోక్ సభ ఎన్నికలు 2024 కార్యచరణ విడుదల అయిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులను చేసే ప్రచార కార్యక్రమాలలో భాగంగా వినియోగించే బల్క్ ఎస్ ఎం ఎస్ లు,వాయిస్ కాల్స్ మెసేజ్ కొరకు ఆయా మొబైల్ నెట్ వర్క్ లను సంప్రదించినప్పుడు సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ కార్యంలో తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని నెట్ వర్క్ పరిధిలో జరిగే ప్రచార సంబంధిత పూర్తి వివరాలతో ఎప్పటికప్పుడు నివేదిక అందించడం తెలిపారు. అనుమతి కొరకు ఎస్ ఎం ఎస్ కి వచ్చిన దరఖాస్తులను అధికారులకు పూర్తి పరిశీలించాలని వివరాలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి లోబడి ఉన్నట్టయితే అనుమతి జారీచేయాలని తెలిపారు. పోలింగ్ రోజున 72 గంటల ముందు నుండి ఎలాంటి అనుమతులు జారీ చేయకూడదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల తహశీల్దార్ శ్రీనివాస్,ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ సునీల్, వివిధ మొబైల్ నెట్ వర్క్ ప్రతి నిధులు,ఎన్నికల విభాగ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking