ప్రజాబలం ప్రతినిధి తార్నాక ఆగస్టు 24:తార్నాక నారాయణ పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలో విద్యార్థులు కృష్ణుడి వేషధారణలో అలంకరించుకొని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన ఉట్టిని చిన్నారులు, విద్యార్థులు పగలగొట్టి వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు వేసిన శ్రీ కృష్ణుడు, రాధా గోపికల వేషాలు ఎంతగానో ఆక్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిఎం గోపాల్ రెడ్డి, ఏటీఎం బాల పరమేశ్వర్ లు మాట్లాడుతూ శ్రీకృష్ణుడి లాగా ఎంతో ఉన్నతంగా ఆలోచించి సహనంతో ఉంటూ మంచి నడవడిక తో ఉండాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పర్వేన్, ఈ-చాంప్స్ కోఆర్డినేటర్ లక్ష్మీ భవాని, ఈ కిడ్జ్ కో- ఆర్డినేటర్ నూర్, ఈ చాంప్స్ వి.పి. సరిత, ఈ- కిడ్జ్.వి.పి షాహీన్, ఏ.ఓ. మహేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు
పాల్గొన్నారు.
Next Post