చార్మినార్‌ పై కాషాయ జెండా ఎగరవేస్తాం

చార్మినార్‌ పాలక్‌ ప్రభారీ అప్సర్‌ పాషా
మైనార్టీ మోర్చా స్వచ్ఛభారత్‌ కన్వీనర్‌ అమీనా
ప్రజాబలం ప్రతినిధి: హైదరాబాద్‌: రానున్న ఎన్నికల్లో చార్మినార్‌ పై కాషాయ జెండా ఎగురవేస్తామని చార్మినార్‌ పాలక్‌ ప్రబారి అప్సర పాషా, బిజెపి మైనార్టీ మోర్చా స్వచ్ఛభారత్‌ కన్వీనర్‌ అమీనా ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మైనార్టీలకు చేరువ చేస్తామని పేర్కొన్నారు. పాలక్‌ ప్రభారీగా నియమితుడైన అప్సర్‌ పాషను అమీనా ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అమీనా మాట్లాడుతూ పాతబస్తీలో అభివృద్ధి కుంటుబడిరదని, ఒక్కసారి బిజెపి కి అధికారం ఇస్తే కొత్త నగరానికి ధీటుగా పాత నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సైఫుల్ల ఖాన్‌, తౌసిఫ్‌ అబ్బాస్‌, సైదులు, గజినీ బాయ్‌, నికత్‌ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking