తెలంగాణ ముస్లిం ఎంప్లాయీస్ అససియేషన్ నిర్మల్ సంఘభవనoలో పదవీవిరమణ పొందిన వారికి శాలువాలతో ఘనoగా సన్మానించారు
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
తెలంగాణ ముస్లిం ఎంప్లాయీస్ అససియేషన్ నిర్మల్ సంఘభవనoలో జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్.ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ పదవీవిరమణ కు సంభందించిన ఆర్థిక లాభాలు ఉద్యోగిగి వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ తరువాత సమయానికి వారికి రావలసిన డబ్బులు సకాలములో అందక ఉద్యోగులకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ప్రభుత్వంహయం లో ఈ సమస్యకు పరిష్కారము లభిస్తుoదని ఆశిస్తున్నామని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇటీవల పదవీ విరమణ పొందిన.అబు ఆమెర్,ఆరోగ్య శాఖ మరియు.యునుస్, నీటి పారుదల శాఖ గార్లకు సాంఘ తరఫున శాలువా, పూలమాల,జ్ఞపికాలతో ఘనoగా సన్మానించారు.వారు ఉద్యోగ కలములో చేసినా సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో సంఘా నాయకులు మాతీన్, మోయిజ్,వహీద్ ఖాన్,లయాక్ అలీ, ఇర్ఫాన్,షాహిద్, ఫిరోజ్, విరసత్, తౌఫిక్,ముంతాజ్, ఫరీద్,గౌస్,ఖాలిద్, రహీమ్, వాజిద్ తదితరులు పాల్గొన్నారు