పెద్దాస్పత్రిలో మౌలిక వసతులపై పట్టింపేది?

 

– ఆస్పత్రికి వెళ్లే దారి బురదమయం
– పారిశుధ్య నిర్వహణ సరిగా లేదనే విమర్శలు

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 5

జమ్మికుంట చుట్టు పక్కల గ్రామాలకు పెద్దాస్పత్రిగా ఉన్న జమ్మికుంట ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి?. వైద్యం కోసం హాస్పిటల్ కు వచ్చిన రోగులు, వారి బంధువులు ఆస్పత్రి ఆవరణం చూసి ఆందోళన చెందుతున్నారు. కనీసంగా మౌలిక వసతుల గురించి పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఆస్పత్రికి వెళ్లే దారి బురదమయంగా ఉండటంతో జనం ఇబ్బంది పడుతున్నారు.

ఆస్పత్రిలోచేతులు కడుక్కునేందుకు ఉపయోగించే వాష్ బేసిన్ లోని కుళాయిని తిప్పినట్లయితే నీరు బయటకు వెళ్లకుండా అక్కడే లీకేజీ అయ్యే దుస్థితి నెలకొంది. కామన్ హాల్లోనే ఇలాంటి పరిస్థితి దాపురిస్తే ఆసుపత్రి లోపల మరింత దుర్గంధ భరితంగా ఉంటుందేమోనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.50 విలువ ఉండే పైప్ వాటర్ బేసిన్ సింక్ కు అమర్చేందుకు ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోవడం సరికాదని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత వర్షాకాల నేపథ్యంలో జనం సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశముందని, వారు ఆస్పత్రికి వచ్చే క్రమంలో ఆస్పత్రి బాగోగులను సంబంధిత అధికారులు పట్టించుకోవాలని పేషెంట్స్ కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking