జమ్మికుంట రూరల్ ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 5
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం -పచ్చదనం కార్యక్రమాన్ని జగ్గయ్యపల్లిలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళా సంఘాలతో స్వచ్చదనం గురించి అవగాహన కల్పించారు. అయిదు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో గ్రామాలలో పరిశుభ్రతకు వర్షాకాలం కావడంతో తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా గ్రామ పంచాయితీ దగ్గర వేసిన ముగ్గుల పోటీ కార్యక్రమం చూపరులను ఆకట్టుకుంది.ఈ కార్యక్రమములో గ్రామ స్పెషల్ ఆఫీసర్ శైలజా దేవి, పంచాయతీ కార్యదర్శి స్వప్న ప్రియ, ఏఎన్ఎం శ్యామల, కారోబర్ రాజేశ్వర్ రావు, అంగన్వాడి టీచర్లు సంధ్య,రజిత,సీఏ రజిత, మహిళ సంఘం నాయకురాలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.