ఆగస్టు 8 నుండి 18 వరకు జరిగే తీజ్ ఉత్సవాలను విజయవంతం చేయండి

 

ఖమ్మం జిల్లా తీజ్ ఉత్సవ కమిటీ పిలుపు

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 5 (ప్రజాబలం) ఖమ్మం నగరంలో తీజ్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు భూక్యా శోభన్ నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశం లో గోర్ బంజారా నాయకులు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా లో ని గోర్ బంజారా నాయకులు మరియు ప్రజలు అందరు కలిసి ఘనంగా తీజ్ ఉత్సవాలను జరుపుకోవాలని ముక్తకంఠం తో నినదించిన్నారు . అలాగే తీజ్ ఉత్సవాలా పవిత్ర ప్రత్యేకతను తెలియజేశారు . అలాగే ఈ నెల 9న ఖమ్మం లో జరిగే ప్రపంచం ఆదివాసి గిరిజన దినోత్సవానికి అందరు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు . ఖమ్మం జిల్లా తీజ్ మహోత్సవ సంబరాలను బంజారా భవనంలో ఆగస్టు 8 గురువారం నుండి ప్రారంభమ వుతాయని మొదటిరోజు ఘవ్ లాయెరో అనగా గోధుమలు తీసుకురావడం , రెండవ రోజు ఘవు గాళ్లేరో అనగా గోధుమలను నాన బెట్టుడం , మూడవరోజు తీజ్ బోరాయేరో అనగా నానబెట్టిన గొదుములను బట్టల్లో వేయడం . నాలుగవ రోజు ఆదివారం బొరేడి తీజ్ అనగా నానబెట్టిన శనగలను ముళ్లకు కుచ్చడం . ఐదవ రోజు ఢమోళ్లి తీజ్ అనగా రొట్టెలు బెల్లం నెయ్యి తో చూర్మో తయారు చేయడం . ఆరవ రోజు హింజ్లో హించెరో అనగా మహిళలు అందరూ కలిసి ఉయ్యాల ఊగడం . ఏడవ రోజు ధప్కార్ దేరో అనగా పూర్వికులు స్మరించుకుని నైవేద్యం పెట్టడం . 8వ రోజు గ్వార్-గ్వాన్ని బళ్ళన్ నాచెరో అనగా కపుల్ డాన్స్ , తొమ్మిదవ రోజు సే భళ్ళన్ రమ్మేరో – నాచెరో అనగా అందరుకలిసి ఆటలు , పాటలు-నృత్యాలు . పదవరోజు గణ్ గోర్ తీజ్ అనగా సేవాలాల్ మహరాజ్ – భోగ్ భాండారో , 11వ రోజు ఆకరి రోజు ఆదివారం తీజ్ వెరాయేరో అనగా కడావో తీజ్ , తీజ్ నిమజ్జనం చేయడం వంటి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు . ఈ సమావేశంలో జిల్లాలోని గోర్ బంజారా ముఖ్య నేతలందరు పాల్గొని ఒక కమిటీగా ఏర్పడ్డారు . ఈ కార్యక్రమంలో అధ్యక్షులు భూక్యా శోభన్ నాయక్ , కార్యదర్శి భూక్యా బిక్షపతి రాథోడ్ , వర్కింగ్ అధ్యక్షులు బి.సోమ్లా నాయక్ , గౌరవ అధ్యక్షులు హెచ్ బి నాయక్ , గౌరవసలహాదారులు బానోత్ బస్కి నాయక్ , రవిచంద్ర చౌహన్ , మరియు కమిటీ సభ్యులుగా భూక్య వీరభద్రం , దారావత్ రామ్మూర్తి నాయక్ , గబ్రూ నాయక్ , బానోత్ కిషన్ నాయక్ , దారావత్ రాములు , బానోత్ శ్రీకాంత్ నాయక్ , బి.లచ్చునాయక్ , దారావత్ రాందాస్ నాయక్ , భూక్యా దేవా నాయక్ , బోడ సాయి నాయక్ , అంగోత్ లక్ష్మణ్ నాయక్ , బి.కేశ్య నాయక్ , ఎన్ శంకర్ నాయక్ , దారావత్ ఖీమా నాయక్ , బానోత్ రవి రాథోడ్ , బానోత్ శ్రీధర్ , బి.శ్రీకాంత్ , బి.చంద్రం , బి.తారా బాయ్ , బి. రాజ్యలక్ష్మి , జి.రాజకుమార్ , బానోత్ మల్సూర్ తదితరులు పాల్గొన్నారు . ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ జిల్లా కమిటీగా వీరు తీజ్ మహోత్సవ కార్యక్రమంను జిల్లా బంజారా ప్రజలందరూ కలిసి విజయ వంతం చేయాలనీ కోరారు

Leave A Reply

Your email address will not be published.

Breaking