విరాళాల సేకరణలో సిపిఐ శ్రేణులు

 

స్పందించండి బాధితులకు చేయూతనివ్వండి

సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 5 (ప్రజాబలం) ఖమ్మం ప్రకృతి విపత్తు కారణంగా నష్టపోయిన కేరళలోని వాయినాడ్ ప్రాంతానికి చేయూతగా నిలిచేందుకు సిపిఐ శ్రేణులు రెండు, మూడు రోజులుగా విరాళాలను సేకరిస్తున్నారు. సోమవారం ఖమ్మం రోటరీనగర్, శ్రీనగర్ కాలనీ సహా పలు ప్రాంతాలలో నిధులను సేకరించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ మాట్లాడుతూ కనివిని ఎరుగని రీతిలో ప్రకృతి విపత్తు సంభవించిందని ఎంత మంది మరణించారో ఇప్పటికి లెక్క తేలడం లేదన్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారని వందలాది మంది అంగవైకల్యం కలిగిందని ఆయన తెలిపారు. ప్రజలు స్పందించి వాయినాడ్ బాధితులకు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శింగు నర్సింహారావు, సిహెచ్ సీతామహాలక్ష్మి, రావిశివరామకృష్ణ, మేకల శ్రీనివాసరావు, పగడాల మల్లేష్, నాయకులు ఏనుగు గాంధీ, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్యులు నానబాల రామకృష్ణ, ఇటికాల రామకృష్ణ, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మి నారాయణ శివ, నాయక్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking