అర్జీదారుల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు సత్వర చర్యలు చేపట్టాలి

 

అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌

ఖమ్మం ప్రతినిధి ఆగష్టు05 (ప్రజాబలం) ఖమ్మం అర్జీదారుల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు సత్వర చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘‘గ్రీవెన్స్‌ డే’’లో అర్జీదారుల నుండి ఆయన వినతులు స్వీకరించి తగుచర్య నిమిత్తం ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరానికి చెందిన బి. రమణ, భర్త లేటు క్రిష్ణ, వెటర్నరీ ఆఫీసు ఖమ్మంనందు ఆఫీసు సబార్డినేటుగా విధులు నిర్వహించి, 2021 సంవత్సరంలో రిటైర్‌మెంట్‌ కావడం జరిగినదని, తనకు రావాలసిన పి.ఆర్‌.సి. బకాయిలు మంజూరు చేయాలని తనకు న్యాయం చేయగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారికి సూచించారు. కొనిజర్ల మండలం సింగరాయపాలెం గ్రామంకు చెందిన వుప్పెల వెంకటరెడ్డి తనకు సింగరాయపాలెం రెవెన్యూ సర్వే నెం.180/అ:/1లో 0.22 ఎకరాలు, 240/బిలో 2.04, 245/అ/1/లో 0.07, 288/ఆలో 4.33, 243లో 2.21, 289/ఆ/2లో 0.39 మొత్తం 11.06 ఎకరాల వ్యవసాయ భూమి వారసత్వంగా సంక్రమించి తన హక్కు భుక్తములో పట్టాదారు పాసు పుస్తకం ఖాతా నెం. 40 కలిగి ఉన్నానని అట్టి భూమిని జూలై 2021లో తన భార్య వుప్పెల స్వరూప పేరున దస్తావేజుపై స్వాధీన అగ్రిమెంటు ఇవ్వడం జరిగినదని అందుకు తన భూమిని కాజేయాలనే నెపంతో మదిగొండ మండలంకు చెందిన తన బంధువులు అయినటువంటి గాంధీ సంజీవరెడ్డి గ్రామం పండ్రేగుపల్లి, గాంధీ కృష్ణవేణి భర్త సంజీవరెడ్డి, గాంధీ స్పందన తండ్రి సంజీవరెడ్డి, గాంధీ సుచిత్ర, తండ్రి సంజీవరెడ్డి, గ్రామం పండ్రేగుపల్లి, ఎరబోలు కృష్ణారెడ్డి, తండ్రి అచ్చిరెడ్డి గ్రామం మాదాపురం ఐదుగురు వ్యక్తులు తనను కిడ్నాప్‌ చేసి చంపుతామని బెదిరించడం జరిగినదని అట్టి భూమిలో మార్చి, 2022న కొనిజర్ల తహశీల్దారు కార్యాలయంలో 10.24 ఎకరాల భూమిని గాంధీ సంజీవరెడ్డి పేరున అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని అట్టి విషయంలో విచారణ జరిపి వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయవలసినదిగా సమర్పించిన దరఖాస్తును పోలీసు కమీషనర్‌ ఖమ్మంకు పరిశీలన నిమిత్తం పంపియున్నారు. ఖమ్మం రూరల్‌ మండలం తెల్దారుపల్లికి చెందిన నూకల ఉమాదేవి, భర్త వీరబాబు తాను మీ సేవా కేంద్రంకు తెల్దారుపల్లి గ్రామానికి దరఖాస్తు చేసుకోవడం జరిగినదని, ఈ- గవర్నెస్స్‌ సొసైటీ పేరుతో 10 వేల రూపాయలు డి.డి. తీసి, కలెక్టర్‌ వారి కార్యాలయంలో ఇవ్వడం జరిగినదని నోటిఫికేషన్‌ మారినందున గతంలో జారీచేసిన నోటిఫికేషన్‌ రద్దు చేసి డిడి కట్టిన నగదును తిరిగి ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం కలెక్టరేట్‌ కార్యాలయపు ఏ.ఓ.కు సూచించినారు. కొణిజర్ల మండలం పల్లిపాడు గ్రామంకు చెందిన డి. ఉపేందర్‌రావు తాను గత జూలై లో బ్రౌన్స్‌ కాలనీ ఎదురుగా ఉన్న ఇండెన్ పెట్రోల్‌ బంక్‌ నందు పెట్రోలు పోయించుకోవడం జరిగినదని అట్టి పెట్రోలులో నీరు కలవడం వలన తన ఆటో పాడయిపోయినదని, అట్టి పెట్రోలు బంకు యజమాన్యంపై చర్యలు తీసుకోగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారికి సూచించినారు ‘‘గ్రీవెన్స్‌ డే’’ జిల్లా రెవిన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking