పారిశుద్ధ్య నిర్వహణ, గ్రీనరీ పెంపు స్వచ్ఛదనం పచ్చదనం లక్ష్యంగా అధికారులు ప్రజాప్రతినిధుల సమక్షంలో తూప్రాన్ మున్సిపాలిటీలో భారీ ర్యాలీ

 

తూప్రాన్, ఆగస్టు -5: ప్రజాబలం న్యూస్ :-

పారిశుద్ధ్య నిర్వహణ, గ్రీనరీ పెంపు లక్ష్యంగా ప్రభుత్వం స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించిందని తూప్రాన్ మున్సిపల్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలని తూప్రాన్ రెవెన్యూ డివిజన్ అధికారి జయచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ ఆధ్వర్యంలో సోమవారం తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం నుండి ప్రధాన రహదారి పై మున్సిపల్ కమిషనర్ ఖాజా మొహైజొద్దిన్ సిబ్బంది తో కలిసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. తూప్రాన్ లోని మున్సిపల్ కార్యాలయం నుంచి బస్టాండ్, చౌరస్తా, మసీదు, జెండా, కిందివాడ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు అవగాహన ర్యాలీలో స్థానిక మున్సిపల్ చైర్మన్ జ్యోతి కృష్ణ, వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్, కౌన్సిలర్ లు రామునిగారీ శ్రీశైలంగౌడ్, పల్లర్ల రవీందర్ గుప్త , నారాయణ గుప్త, , రాజు, భగవాన్ రెడ్డి, రవీందర్ రెడ్డి , మామిడి వెంకటేష్, రఘుపతి మున్సిపల్ మేనేజర్ రఘువరన్, సిబ్బంది, అంగన్ వాడి, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో జయచంద్రరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖాజా మొహిజిద్ధిన్ లు మాట్లాడుతూ… పారిశుద్ధ్య నిర్వహణ గ్రీనరీ పెంపు లక్ష్యాలతో ప్రభుత్వం ఆగస్టు 5 నుంచి 9 వరకు స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో ముందస్తుగా ర్యాలీ చేపట్టామని తెలిపారు. స్వచ్చదనం – పచ్చదనం ర్యాలీలో వివిధ పాఠశాల విద్యార్థులు, మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ దుర్గయ్య , మున్సిపల్ వార్డ్ ఆఫీసర్లు , మెప్మా ఆర్పిలు, అంగన్వాడీ టీచర్లు , ఆశా వర్కర్లు, కళాకారులు, మెప్మా మహిళా సంఘాల పెద్ద ఎత్తున పాల్గొన్నాయని, వీరు ఇంటికి వెళ్లిన తరువాత ఆ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చూడాలని, గ్రీనరీ పెంచే దిశగా మొక్కలు నాటి వాటిని పూర్తి స్థాయిలో సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది , ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking