స్వచ్చదనం-పచ్చదనం అనే అవగాహన కార్యక్రమం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 05 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణం పరిశుభ్రంగా ఉండే విదంగా 5 రోజుల ప్రణాళిక ఏర్పాటు చేసి రోజు ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని దానికి పట్టణ ప్రజానీకం సహకారం అందించాలని, స్వచ్చదనం – పచ్చదనం అనే అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని మున్సి పాలిటీ కార్యాలయం నుండి ఉత్కూర్ చౌరస్తా వరకు అవగాహన ర్యాలీని చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమానికి చైర్మన్, కౌన్సిలర్లు..అంగన్వాడీ,ఆశా కార్యకర్తలు, స్కూల్ పిల్లలు పరిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా చైర్మన్ నల్మస్ కాంతయ్య మాట్లాడుతూ… 5 రోజుల పాటు జరిగే స్వచ్చదనం -పచ్చదనం అనే కార్యక్రమంలో చెత్త బండ్లల్లో చెత్త వేసే విదంగా అవగహన కల్పించడం, ఇంటి నుండి మొక్కలు నాటేవిదంగా పచ్చదనం ప్రాముఖ్యత తెలపడం,అలాగే రోడ్లపై ఏర్పడ్డ గుంతలు పూర్చడం, నీరు నిలువ లేకుండా జేసీబీ తో కాలువలు పూడిక తీయడం ఫ్రైడే డ్రై డే చేపట్టడం లాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ప్రతి ఒక్కరు వర్షకాలం వల్ల వచ్చే అనర్ధాలను పట్ల అవగహన కలిగి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవడం కోసం ఈ అవగహన కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమీషనర్ కల్లెడ రాజశేఖర్, కౌన్సలర్ సురేష్ నాయక్,చింత సువర్ణ అశోక్ కుమార్, మున్సిపల్ మేనేజర్ టి రాజేశేఖర్, స్కూల్ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking