ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 05 : ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారుల సమన్వయంతో కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.సోమవారం జిల్లాలోని నస్పూర్ లోగల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి హరికృష్ణ తో కలిసి ఆర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తారు.నస్పూర్ మండల కేంద్రానికి చెందిన రెగుంట భీమయ్య మండల తాను దౌడేపల్లి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ లో 50 వేల రూపాయల రుణ పోందానని, ప్రభుత్వం అందిస్తున్న రుణమాఫీ పథకంలో తన రుణాన్ని మాఫీ చెయ్యాలని కోరుతూ ధరఖాస్తూ అందజేశారు. మంచిర్యాల పట్టణంలోని హమలివాడ-సూర్యనగర్ కు చెందిన రాగులు వెంకటస్వామి గత 5 సంవత్సరాల నుండి తనకు దివ్యాంగుల పింఛన్ రావడం లేదని,ఆర్జీ సమర్పించారు. జైపూర్ మండలం వెంకట్రావుపల్లి గ్రామస్తులు తమ గ్రామపంచాయతీలోని నూతనంగా ఏర్పాటు చేసిన వెంకట్రావుపల్లి,దుంపపల్లి గ్రామాలలోని రిజర్వేషన్ మార్పు చేయాలని కోరుతూ ఆర్టీ సమర్పించారు. తాండూరు మండలంలోని అచ్చలాపూర్ గ్రామానికి చెందిన కాటం లక్ష్మి తన భర్త చనిపోయినందున అత్త మామల నుండి తన భర్తకు రావలసిన తనకు ఇచ్చారని కోరుతూ ఆర్టీ సమర్పించారు, భీమారం మండలం మద్దికల్ గ్రామానికి చెందిన వొడెటి వేణుగోపాల్ రెడ్డి అనకు గ్రామ శివారు భూమి ఉందని, దానిలో చూపించడం లేదని, మిస్సింగ్ సర్వే నెంబర్ క్రింద దరఖాస్తు చేసుకున్నానని సవదించాలని కోరుతూ దరఖాస్తులను అందజేశారు. హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన అల్లి లక్ష్మి మంచిర్యాల శివారులో తన భర్త కు భూమి ఉందని, ధరణి లో చూపించడం లేదని మిస్సింగ్ సర్వే నెంబర్ కింద దరఖాస్తు చేసుకున్నారని, సవరించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. హాజీపూర్ మండలం గుడిపేట గ్రామానికి చెందిన ముడిమడుగుల లక్ష్మీ తనకు దుబ్బ పల్లి శివారులో భూమి ఉందని,ఇట్టి భూమిని హగ్గులు నిద్దరించాలని కోరుతూ,దరఖాస్తులను అందజేశారు.నెన్నెల మండలం మెంట్ పల్లి గ్రామానికి చెందిన సోదారి రాజశేఖర్ ప్రభుత్వం చేపట్టిన అభయాస్తం 6 గ్యారంటీల దరఖాస్తుల వివరాల నమోదులో ఆపరేటర్ గా పనిచేశారని, డబ్బులు ఇచ్చారని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మంచిర్యాల పట్టణంలోని జాఫర్ నగర్ కు చెందిన కామెర్ల పృథ్వీరాజ్ తాను మున్సిపల్ హెల్త్, శానిటరీ విభాగంలో ఇన్స్పెక్టర్కు దరఖాస్తు చేస్తున్నానని, ఒప్పంద/పరుగు సేవల పద్ధతిని ఉపాధి కల్పించాలని కోరుతూ ఆర్టీ సమర్పించారు. నిన్నేల మండలం గుండ్ల సోమవారం గ్రామానికి చెందిన చాగంటి చంద్రయ్య తనకు వంశభారంగా భూమి వస్తుందని,ఇంటి భూమి విస్తీర్ణం ధరణి పాస్ పుస్తకంలో తక్కువగా నమోదు అయినట్టు ఉందని సవరించి ఇవ్వాలని కోరుతూ వస్తుందని, ఇట్టి భూమి విస్తీర్ణం ధరణి పాస్ పుస్తకంలో తక్కువగా నమోదు అయిందని సవరించి ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర పశువు మిత్రుల వర్కర్స్ యూనియన్ సి.ఐ.టి.యు ప్రతినిధులు తమ దరఖాస్తులో పశు మిత్రులను వర్కర్ గా గుర్తించి కనీస వేతనం, గుర్తింపు కార్డులు,యూనిఫారం, గ్లౌజులు,మాస్కులు,మందులతో పందులతో కూడిన కిట్లు,పని భద్రత,భీమా సౌకర్యం,మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.ఈ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారుల సమన్వయంతో చర్య తీసుకోమని ఈ కార్యక్రమంలో సమందిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking