గౌరవ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారి సహయ సహకారంతో
ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
సుమారు 80 కంపెనీల తో “మెగా జాబ్ మేళా” పోస్టర్ ఆవిష్కరణ
నకిరేకల్ నియోజకవర్గం:
ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గౌరవ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారి సహయ సహకారంతో నిర్వహించనున్న “మెగా జాబ్ మేళా”పోస్టర్ ను శనివారం నాడు క్యాంప్ కార్యాలయంలో విడుదల చేశారు…. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా మారింది అన్ని అన్నారు..
అందులో భాగంగానే నేను ఎంఎల్ఏ గా ఉన్నపుడు ప్రభుత్వం పాఠశాలలో వాల్లంటీర్ల ద్వారా ఆంగ్ల విద్యాను అందించడం జరిగింది కరోనా క్లిష్టమైన సమయంలో ప్రజలకు ఫౌండేషన్ ద్వారా అనేక సేవలు అందించాము.. గతంలో తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసే ఉద్యోగాలకు ఉద్దీపన ద్వారా 3 నెలలు ఉచిత కోచింగ్ ఇచ్చి మెటీరియల్ అందించాము అని తెలిపారు..
👉ఈ నెల 12 వ తేదీ(ఆదివారం) రోజున మెగా జాబ్ మేళా ను నకిరేకల్ పట్టణంలోని హైస్కూల్ నందు నిర్వహించనున్నాము. సుమారు 80 పై చిలుగా కంపెనీలు ఇందులో పాల్గొంటాయి..కావున నియోజకవర్గ నిరుద్యోగ, యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని మనవి.
సమయం ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు
మరిన్ని వివరాలకు
95157 38729
99858 58091
7287894394
93980 69412