ఈనెల 18 లోగా ఆక్టివ్ లేబర్లో 50 శాతం లేబర్ మొబ లైజేషన్ కావాలి
………జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
సంగారెడ్డి పిబ్రవరి 10 ప్రజ బలం ప్రతినిధి:
పంచాయితీ కార్యదర్శులు బాధ్యతగా పని చేయాలని
జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ పేర్కొన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలోగ్రామీణాభి
వృద్ధి శాఖ ఏపీ డి లు, డి ఎల్ పి ఓ లు , నారాయణఖేడ్, పటాన్చెరు నియోజకవర్గాల
ఎంపీ ఓలు, ఎంపీడీవోలు, ఏపీవోలు, పంచాయతీ సెక్రెటరీలతో వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్షించి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద ప్రతి గ్రామంలో ఆక్టివ్ లేబర్లో 50 శాతం లేబర్ ను మొబ లైజేషన్ చేయాలని స్పష్టం చేశారు.ఎన్ ఎం ఎం ఎస్ ఆప్ లో మొబైల్ ద్వారా లేబర్ ఫొటోస్ తో అటెండెన్స్ అప్లోడ్ చేయాలని, సూచించారు. చేసిన పనికి సంబంధించి ప్రాపర్ గా రికార్డు చేయాలన్నారు. అప్పుడే కూలీలకు సరైన కూలీ వస్తుందన్నారు. పే ఆర్డర్స్ జనరేట్ చేయాలని సూచించారు.
ఈజీఎస్ కింద ప్రతి గ్రామపంచాయతీలో కనీసం 20 పనులు
శ ల్ఫ్ లో ఉండాలన్నారు. లేబర్ పనిచేయగలిగిన పనులు గుర్తించాలన్నారు. శ్రమ శక్తి సంఘాలతో చర్చించి, టెక్నికల్ అసిస్టెంట్ తో అంచనా చేయించి ప్రతిపాదనలు పంపితే మంజూరు ఇస్తారని తెలిపారు. శ్రమ శక్తి సంఘాల వారిగా పనులు గుర్తించడంలో ప్రాధాన్యత నివ్వాలన్నారు.
ఈనెల 18 లోగా 50 శాతం లేబర్ మొబలైజేశన్ కావా లని తెలిపారు.
గ్రామపంచాయతీకి ఆదాయ వనరుగా టాంకర్ ,ట్రాలీ మారాలన్నారు. ప్రతి శుక్రవారం మొక్కలకు నీరు పట్టాలని ఆదేశించారు. ప్రతి గ్రామపంచాయతీలో వారంలో కనీసం 10 ట్యాంకర్లు వినియోగించాలని, ట్యాంకర్ ద్వారా ఆదాయం రావాలని, ప్రతివారం నివేదికను డిఆర్డిఓకు అందించాలని సూచించారు. ఎ వెన్యూ ప్లాంటేషన్ పై దృష్టి సారించాలన్నారు.
అర్హత గల ఆసరా పింఛన్దారులు ఎవరు మిగిలిపోరాదని, అలాంటి వారిని గుర్తించి వివరాలు సమర్పించాలని సూచించారు.
నర్సరీలలో నాణ్యమైన విత్తనాలు పెట్టాలని, తొందరగా మొలవాలని, ఎక్కడైనా మొలకెత్తనట్లైతే, వాటి స్థానంలో నారు తీసుకువచ్చి పెట్టాలన్నారు.
ప్రతిరోజు ఇంటింటి చెత్త సేకరణ జరగాలని, సెగ్రీ గేషన్ జరగాలని, తడి చెత్త తో కంపోస్ట్ ఎరువు తయారు కావాలని, తడి పొడి చెత్త అమ్మకంతో గ్రామ
పంచాయతీలకు ఆదాయం సమకూరాలన్నారు. వచ్చిన ఆదాయంలో పంచాయతీ కార్మికులకు అవసరమైన నూనె, సబ్బులు తదితర వస్తువులతో కిట్ ఇవ్వాలని సూచించారు.
వైకుంఠధామాలు, వైకుంఠ రథాలు వినియోగంలోకి తీసుకురావాలన్నారు. వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, తెలంగాణ క్రీడా ప్రాంగణాల చుట్టూ బయోఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
18 సంవత్సరాలు పైబడిన అందరికీ కంటి వెలుగు శిబిరాలలో కంటి పరీక్షలు చేయించాలని, గ్రామపంచాయతీలలోని అర్హులకు కంటి పరీక్షలు చేసుకునేలా ప్రోత్సహించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్, డి ఆర్ డి ఓ శ్రీనివాస రావు, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, అదనపు పీడీలు, డి ఎల్ పి ఓ లు, నారాయణఖే పటాన్చెరు నియోజకవర్గాల లోని ఎంపీడీవోలు, ఎంపీ ఓలు, ఏపీఎంలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.