యజ్ఞా యాగలు పూజలతో నూతన భవనంలోకి ప్రవేశం..
వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 10:
ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా వరంగల్ జిల్లా కార్యాలయాన్ని వేణు రావు కాలనీ నుండి హంటర్ రోడ్డులోని సాయి నగర్ లో నూతనంగా నిర్మించిన భవనంలోకి శుక్రవారం తరలించారు. ఈ సందర్భంగా నూతన భవనంలో సంస్థ చైర్మన్ సీఏ ప్రదీప్ చందర్, బిందు సతీమణి దంపతులు వేద మంత్రాల మధ్య యాగం హోమాలు నిర్వహించి ఘనంగా నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ ప్రదీప్ రావు మాట్లాడుతూ వరంగల్ జిల్లా సిఏ విద్యార్థులకు కామర్స్ కోర్సులను అభ్యసించే విద్యార్థులకు కావలసిన విషయ పరిజ్ఞానం అందించడానికి నూతన భవనం అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంటుందని జిల్లాలోని అన్ని వాణిజ్య సేవా సంస్థలను వివిధ పనులు చట్టాలపై ఉచిత అవగాహన అందించడానికి తోడ్పాటును అందిస్తుందని అన్నారు. వరంగల్ జిల్లాతో పాటు ఇతర జిల్లాలోని సిఏలకు విజ్ఞాన సమపార్జన సమకూర్చడం కోసమే నూతన భవనంలో అన్ని సమకూర్చడం జరిగింది అని అన్నారు ఈ కార్యక్రమంలో హరికృష్ణ, సత్యనారాయణ, గోపీచంద్, రాజేంద్ర కుమార్, శ్రవణ్ కుమార్, ఓం ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.