వరంగల్ సిపి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వికలాంగుడు.

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 10:
వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఏవి రంగనాథ్ తన మార్కు నిర్ణయాలతో ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నారు. కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన అసద్ అనే వికలాంగుడు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ చొరవతో కబ్జా అయిన తన భూమి తనకు తిరిగి దక్కిందని ఆనందంతో కాశిబుగ్గ చౌరస్తాలో సిపి చిత్రపటానికి పాలతో అభిషేకం చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. సిపి నిర్ణయాలతో బాధితులకు న్యాయం జరుగుతుందని ప్రజలు మెచ్చుకుంటున్నారు. బాధితులు న్యాయం కోసం సిపి కార్యాలయాన్ని ఆశ్రయించిన వెంటనే బాధితుల వైపున నిలుస్తూ వారికి న్యాయం చేస్తున్నారు. సొంత శాఖలో అవినీతి అధికారులను సస్పెండ్ చేస్తూ , భూ కబ్జాలు ప్రోత్సహిస్తూ, కబ్జాలు చేస్తున్న వారిపై కఠినమైన చట్టాలను ప్రయోగిస్తూ కేసులు నమోదు చేస్తూ వచ్చిన తక్కువ సమయంలోనే శభాష్ అని పించు కుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking