సంగారెడ్డి ఫిబ్రవరి 10 ప్రజ బలం ప్రతినిధి:
సంగారెడ్డి జిల్లాలోని గ్రామాలలో టీబీ రహిత గ్రామాలుగా, నిర్మించాలని జిల్లా పరిషత్ సీ.ఈ.వో సిహెచ్.ఎల్లయ్య పిలుపునిచ్చారు జిల్లా కలెక్టరేట్లో నేడు వివిధ గ్రామ కార్యదర్శిలు ఎంపీడీవో లాక్ లతో నిర్వహించిన సమావేశంలో.ఆయన మాట్లాడుతూ,రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలను అనుసరించి. జిల్లాలోని అన్ని గ్రామాలలో, టీబీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా టీబి రహిత గ్రామాలుగా చేయాలని, ఆయన తెలియజేశారు. ముందుగా సంగారెడ్డి మరియు పటాన్చెరువు పరిధిలోని వివిధ కార్యదర్శులకు శిక్షణ తరగతులు జిల్లా టిబి నివారణ విభాగం మరియు టీబి అలర్ట్ ఇండియా “బ్రేకింగ్ దా బారియర్స్ “ప్రాజెక్టు మరియు సంబంధిత ఎం.పీ.డీ.వోల ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీబి నివారణ అధికారిని డాక్టర్.రాజేశ్వరి టీబి పట్ల అవగాహన కల్పిస్తూ జిల్లాలో చేపట్టిన వివిధ కార్యక్రమాలను గురించి తెలియజేశారు. “బ్రేకింగ్ ద బారియర్స్” ప్రాజెక్టు లీడ్ పి.పురుషోత్తం టిడిపి రహిత గ్రామాలుగా చేయటానికి తమ చేపట్టిన కార్యక్రమాలను గూర్చి తెలియజేశారు గ్రామస్థాయిలో చేపట్టవలసిన కార్యక్రమాలను గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ ఆఫీసర్ శ్రీ వి .సురేష్ మోహన్ డి .ఆర్. డి, పిడి శ్రీ సిహెచ్. శ్రీనివాసరావు మరియు వివిధ మండల అభివృద్ధి ఆఫీసర్లు, ఏ.పీ.వోలు వివిధ గ్రామ కార్యదర్శి లు పాల్గొన్నారు.