జనగణంలో కులగణనపై జాతీయ పార్టీలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి వైయస్సార్సీపీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ వి విజయసాయిరెడ్డి
విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ ఫిబ్రవరి 10 ();జాతీయస్థాయిలో జనగణన జరుగుతున్న ఈ సందర్భంలో బీసీల కూడా కుల గణన జరగాలని పలు సంఘాలు చేస్తున్న డిమాండ్ పై వైసీపీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కులగణనపై సిద్ధంగా లేని పరిస్థితుల్లో మరికొన్ని రాజకీయ పార్టీలతో కలిసి ముందుకు వెళుతున్నమనీ వైయస్సార్సీపి రాజ్యసభ ఫ్లోర్ లీడర్ వి విజయసాయి రెడ్డి తెలిపారు. ఈరోజు పార్లమెంటు సమావేశాలు ముగిసిన అనంతరం విశాఖపట్నం విచ్చేసిన వి విజయసాయి రెడ్డిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇంచార్జ్ కర్రీ వేణుమాధవ్ మర్యాద పూర్వకంగా కలిసారు.ఈ సందర్బంగా పార్లమెంట్లో బీసీల డిమాండ్ల పట్ల కమిట్మెంట్తో మరికొన్ని రాజకీయ పార్టీలతో కూడా కలిసి కేంద్రంపై ఒత్తిడి చేస్తున్న విధానాన్ని విజయసాయి రెడ్డి తెలిపినట్లు కర్రీ వేణుమాధవ్ తెలిపారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున అభినందనలు చెప్పవలసిందిగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు విశాఖపట్నం ఎయిర్పోర్టులో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్ ఢిల్లీ ఇంచార్జ్ కలిసారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే బీసీలకు చేస్తున్న అనేక కార్యక్రమాలు దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి సంక్షేమం రాజకీయ అవకాశాలు బడుగు బలహీన వర్గాలకు అందజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కర్రీ వేణుమాధవ్ వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు