కేసీఆర్‌ జన్మదినం – క్రీడాకారులకు పర్వదినం – శాట్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌

హైదరాబాద్ ఫిబ్రవరి 10 ();కళలు, క్రీడలు సాంస్కృతిక, సాహితీ రంగాలపై ఎంతో మక్కువ ఉన్న మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో వివిధ క్రీడా సంఘాలు పెద్ద ఎత్తున క్రీడా కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకు రావడం సంతోషకరమని శాట్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి జన్మదినం పురస్కరించుకొని ఈ నెల 17, 18, 19 తేదీలలో సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించనున్న ‘‘కేసీఆర్‌ కొహినూర్‌ కప్‌’’ ఇంటర్నేషనల్‌ రిథమిక్‌ జిమ్నాస్టిక్స్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల వాల్‌ పోస్టర్‌ను ఈరోజు ఆయన ఛాంబర్‌లో ఆవిష్కరించారు.కేసీఆర్‌ గారి జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నలుమూలలా వివిధ క్రీడా సంఘాలు క్రీడాభిమానులు పెద్ద ఎత్తున క్రీడా కార్యక్రమాలు నిర్వహించడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, ఈ సందర్భంగా రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు రాష్ట్రం క్రీడా పండుగ వాతావరణం నెలకొనేలా ముందుకు వస్తున్న నిర్వహకులకు ఆయన అభినందనలు తెలియజేశారు.తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఇస్తోన్న ప్రోత్సాహంలో రాష్ట్రంలో ఒక మంచి క్రీడా వాతావరణం నెలకొందని, అన్ని రంగాల మాదిరిగానే క్రీడలను కేసీఆర్‌ ప్రభుత్వం నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జిమ్నాస్టిక్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కె. మహేశ్వర్‌, హైదరాబాద్‌ జిల్లా క్రీడా యువజన సంక్షేమ శాఖ అధికారి సుధాకర్‌ రావ్‌, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు దొంతి వినోద్‌ కుమార్‌, ప్రొఫెసర్‌ రాజేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking