ఎంహెచ్ పిఎచ్ వ్యవస్థాపక అద్యక్షులు మైస.ఉపేందర్ మాదిగ..
ప్రజాబలం ఉమ్మడి మెదక్ / హైదరాబాద్:10 తెలంగాణ రాష్ట్రంలోని మాదిగ లకు 12 శాతం రిజర్వేషన్ సాదించేందుకు మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆద్వర్యంలో ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందని,పోరాటానికి సిద్దంగా ఉంటుందని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అద్యక్షులు మైస.ఉపేందర్ మాదిగ తెలియజేశారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మెడలు వంచైనా వర్గీకరణ 12 శాతం రిజర్వేషన్ సాదిస్తామని తెలిపారు.మాదిగ లను మోసం చేసిన పార్టీగా బిజెపి పార్టీ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.ఈ పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు.లేనియెడల తెలంగాణ లో బిజెపి పార్టీకి మాదిగలు తగిన బుద్ది చెబుతారని అన్నారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,బిజెపి తెలంగాణ రాష్ట్ర అద్యక్షుడు ఎంపి బండి.సంజయ్ కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఒప్పించి రిజర్వేషన్ పార్లమెంటులో ప్రవేశపెట్టించాని కోరారు.
మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కు కృిష్ణ మాదిగ అనుకూలమా,వ్యతిరేకమా..?
తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో మాదిగ ల పక్షాన పోరాటం చేస్తున్న మాదిగ సంఘాలు,సిద్ధంగా ఉంటాయా అని అన్నారు.మాదిగల రిజర్వేషన్ కోసం రెండు తెలుగు రాష్ట్రాలలో పోరాటం చేస్తున్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎంఆర్ పిఎస్)వ్యవస్థాపక అద్యక్షులు మంద.కృిష్ణ మాదిగ మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కు అనుకులమా లేక వ్యతిరేకమా తెలియజేయాలని అన్నారు.మాదిగ లకు 12 శాతం రిజర్వేషన్ మంద.కృిష్ణ మాదిగ అనుకూలమైతే మాదిగ హక్కుల పరిరక్షణ సమితి(ఎంహెచ్ పిఎస్)సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తుందని,తెలంగాణ మాదిగల పక్షాన పోరాడుతున్న కృిష్ణ మాదిగ ఉద్యమానికి మద్దతు ఇస్తామని తెలియజేశారు.
Prev Post