వరంగల్ ఎసిపి గా బాధ్యతలు తీసుకున్న బోనాల కిషన్

 

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి:

వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా శుక్రవారం బోనాల కిషన్ బాధ్యతలను తీసుకున్నారు. మట్టేవాడ డివిజన్ కార్యాలయంలో గిరి కుమార్ కలకోట రిలీవ్ అనంతరం బాధ్యతలను తీసుకున్న ఆయన వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాద్ ను పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు పోలీస్ స్టేషన్లో బోనాల కిషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా బాధ్యతలను నిర్వర్తించి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. హనుమకొండ సీఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో భూపాలపల్లి జిల్లాకు డిఎస్పీగా పదోన్నతి పై వెళ్లిన ఆయన అక్కడి నుండి సిరిసిల్ల రాజన్న జిల్లాకు డీఎస్పీగా వెళ్లారు. అక్కడ నుండి డిజిపి ఉత్తర్వుల మేరకు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా వరంగల్ డివిజన్ కు బదిలీ పై వచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking