పండుగల్లో సంక్రాంతి

తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే పండుగల్లో సంక్రాంతి కూడా ఒకటి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి సంచరించిన రోజునే సంక్రాతి జరుపు కుంటారు. ఈ ఏడాది మకర సంక్రాంతి తేదీకి సంబంధించి ప్రజల్లో గందరగోళం నెలకొంది జనవరి 14న జరుపు కోవాల లేక 15న జరుపు కోవాల అని, దీనికి కారణం మకర సంక్రమణం జనవరి 14వ తేదీ (శనివారం) రాత్రి 08.45 నిమిషాలకు సూర్య భగవానుడు మకరరాశిలో సంచరిస్తున్నాడు. అందువల్ల జనవరి 14న మకర సంక్రాంతి ముహుర్తం వస్తోంది, సాధారణంగా మకర సంక్రాంతి సమయంలో స్నానం, దానాలు వంటివి చేస్తుంటారు. కానీ రాత్రి సమయంలో సంక్రాంతి స్నానం, దానం చేయకూడదు. అందువల్ల ఉదయ తిథి అంటే సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడో ఆ సమయంలో మకర సంక్రాంతి స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం మకర సంక్రాంతిని 15 జనవరి 2023 ఆదివారం ఉదయం 07:15 నుండి 09:00 వరకు శుభ సమయం కావున సంక్రాంతి స్నానాలు, దానాలు చేస్తే మంచి జరుగుతుందని పండితుల అభిప్రాయం. ఆదివారం మకర సంక్రాంతి రెండూ సూర్యుడికి సంబంధించిన రోజులు రెండూ ఒకేరోజు రావడంతో సూర్య భగవానుని ఆరాధించడం వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయి. నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకుని, నువ్వుల నూనెను గోరువెచ్చగా కాచి ఒళ్ళంతా మర్ధన చేసుకోవాలి. నల్ల నువ్వులను కొన్ని తలపై వేసుకుని, సున్నిపిండితో ఒళ్ళు రుద్దుకుని తలస్నానం చేయాలి ఆ తర్వాత కొత్త బట్టలు ధరించి దేవుడిని పూజించి, కుటుంబ సభ్యులతో కలిసి పిండి వంటలు తిని, తర్వాత దాన ధర్మాలు చేయాలని, సూర్య భగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి వచ్చే ఈ రోజు నుంచి ఖర్మాలు ముగుస్తాయి కాబట్టి వివాహం, గృహ ప్రవేశం వంటి మొదలైన శుభ కార్యాలు ప్రారంభ మవుతాయి. సూర్యుడు ఉత్తరాయణంలో ఉన్నప్పుడు పగటి సమయం క్రమంగా పెరుగుతుంది, చలికాలం తగ్గుముఖం పట్టి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking