పదవ తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.సంబంధిత అధికారులకు ఆదేశించిన

 

... జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి మార్చి 16 (ప్రజ బలం ప్రతినిధి)జిల్లాలో ఏప్రిల్ 3 నుండి నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలకు పటిష్టమైన ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై విద్య,సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏప్రిల్ 3 నుండి 13 వరకు పదోతరగతి పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు.
జిల్లాలో పరీక్షల నిర్వహణకు 118 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉ. 9.30 నుండి మ.12.30 వరకు పరీక్షలు జరుగుతాయని, విద్యార్దులు ఒక గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో అవసరమైన మౌళిక వసతులు ఏర్పాట్లు చేయాలని, వేసవి దృష్టా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రతి కేంద్రం వద్ద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని, ఓ.అర్.ఎస్. ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు.
పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్
బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.
మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదని స్పష్టం చేశారు.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లను మూసివేయించాలని కలెక్టర్ ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల్లో మంచినీరు, టాయిలెట్స్, సరైన వెలుతురుకు లైట్లను ఏర్పాటు చేయాలని,సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని , విద్యార్థులు పరీక్షా కేంద్రానికి నిర్ణీత సమయంలోగా చేరుకునేలా చూడాలన్నారు.
పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునే విధంగా రూట్ల వారిగా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు కలెక్టర్ సూచించారు. పరీక్షల నిర్వహణలో ఆయా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
చూడాలన్నారు
పదవ తరగతి పరీక్షల నిర్వహణకు గాను జిల్లాలో 118 పరీక్ష కేంద్రాలను, 26 స్టోరేజ్ పాయింట్లను ఏర్పాటు చేశామని, 5గురు ఫ్లయింగ్ స్క్వాడ్లను, 18 మంది రూట్ ఆఫీసర్లను,118 మంది చీఫ్ సూపర్డెంట్లను, 118 మంది డిపార్ట్మెంటల్ అధికారులను, ఒక అడిషనల్ డిపార్ట్మెంటల్ అధికారిని,సుమారు 1100 మంది ఇన్విజిలేటర్లను నియామకం చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేష్ కలెక్టర్కు వివరించారు.
పరీక్షలకు 21,389 మంది రెగ్యులర్ , 24 మంది ప్రైవేట్,1131 మంది ఒకేషనల్ అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్
వీరారెడ్డి, జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేష్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ విజయ, అసిస్టెంట్ ఎగ్జామినేర్ మణిదీప, డి సి ఈ బి సెక్రటరీ లింభాజీ, జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ కవిత, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
అనంతరం జిల్లా స్థాయి ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు విద్యార్థులను అన్ని విధాల సన్నద్ధం చేయాలని కోరారు. ఆయా సబ్జెక్టు టీచర్లు ప్రధానోపాధ్యాయులు యూనిటీగా కృషి చేస్తే వంద శాతం ఫలితాలను సాధించవచ్చన్నారు. పరీక్షలు పూర్తయ్యే వరకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులను కొనసాగించాలన్నారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేలా చూడాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి రాజేష్, జిల్లా విద్యాశాఖ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ విజయ, ఎంఈఓ లు, ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking