5 వ తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకొనుటకు గడువు పొడిగింపు…

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 17 : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గురుకులాలలో 2023 – 24వ విద్యా సంవత్సరానికి,ప్రవేశం పొందుటకై ఏప్రిల్ 23 వ తేదీన నిర్వహించే ఐదవ తరగతి ప్రవేశ పరీక్ష కు దరఖాస్తు చేసుకొనుటకై,గడువును 2023 మార్చ్ 20 వ తేదీ వరకు పొడిగించినట్లు స్థానిక లక్షెట్టిపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల ప్రిన్సిపల్ ఎం. లలిత కుమారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.వివిధ కారణాలవల్ల ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోనటువంటివాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ తెలియజేశారు.దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా మాత్రమే అంగీకరించబడతాయని,సొసైటీ వెబ్సైట్ tswreis.ac.in https://tgcet .cgg.gov.in/లో మీకు కావలసిన సమాచారం అందుబాటులో ఉంటుందని, లక్షెట్టిపేట ప్రిన్సిపల్ ఎం.లలితకుమారి తెలియజేశారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking