మెదక్ ప్రజా బలం న్యూస్ :-
మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి టీచర్ ఎమ్మెల్సీ
ఏవిఎన్ రెడ్డి గెలవడం పట్ల తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం హర్షం వ్యక్తం చేసింది. తపస్ మద్దతిచ్చిన వ్యక్తి గెలవడం పట్ల మెదక్ జిల్లా పట్టణ కేంద్రంలో తపస్ నాయకులు శివాజీ చౌరస్తా పటాకాయలు కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తపస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ తపస్ భవిష్యత్తులో ఉపాధ్యాయ సమస్య పట్ల, జీఓ 317 రద్దు గురించి, సిపిఎస్ రద్దు గురించి పోరాటం చేస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ కులకర్ణి, రాజు, ప్రభాకర్,నర్సింలు,శ్రీకాంత్ రెడ్డి,సురేందర్, నరేందర్,వెంకటేష్,రేఖ, ఆంజనేయులు, నందు, అర్చన, నరేందర్,మల్లేష్,శ్రీనివాస్,తపసు నాయకులు తదితరులు పాల్గొన్నారు.