ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 17 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మామిడిపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడికందుల అనిల్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదమలో మరణించగా శుక్రవారం దిన కర్మ సందర్భముగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రక్త దానం శిబిరంలో 54 మంది రక్త దానం చేయడం జరిగింది.జననీ బ్లడ్ బ్యాంక్ మంచిర్యాల వారు రక్త సేకరణ చేశారు.చేపట్టిన ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ… శిబిరాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని అనిల్ ఉన్నప్పుడు ఈ లాంటి సేవ కార్యక్రమాలు చాలా చేసే వాడు అని కానీ దుర దృష్ట వశాత్తూ మరణించడం తో అతను స్వర్గ ప్రాప్తి పొందాలని ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు అన్నారు.ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని సంతాపం తెలిపినరు.