– సాంఘిక సంక్షేమ గురుకుల ప్రిన్సిపాల్ డాక్టర్ సద్గుణ మేరి గ్రేస్
మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో ఐదవ తరగతిలో ప్రవేశానికి పరీక్ష గడువును ఈనెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దాతర్ పల్లి శివారులోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సద్గుణ మేరీ గ్రేస్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల స్టడీ సర్టిఫికేట్లు, క్యాస్ట్, ఇన్ కం, లోకల్ సర్టిఫికేట్లతో పాటు రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలతో ఈనెల 20 లోగా మీసేవ లేదా ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. గడువు పెంపును సువర్ణావకాశం గా భావించి, ఆలస్యం చేయకుండా ఈనెల 20 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.