టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి విజయం ప్రభుత్వానికి చెంపపెట్టు

బిజెపి రిటైర్డ్ టీచర్స్,ఎంప్లాయిస్ సెల్ రాష్ట్ర కో చైర్మన్ తిరువరంగం ప్రభాకర్
హైదరాబాద్ మార్చ్ 17 ;తెలంగాణ మేధావి వర్గం ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బిజెపి రిటైర్డ్ టీచర్స్ మరియు ఎంప్లాయిస్ సెల్ రాష్ట్ర కో చైర్మన్ తిరువరంగం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఉపాధ్యాయ వర్గం తెలంగాణ రాష్ట్రం వచ్చాక తీవ్ర నిస్పృహలకు లోను కావడం మూలంగా తెలిపిన తెలంగాణ నిరసన సెగగా ప్రభుత్వం భావిస్తూనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల వర్గాలకు సంబంధించిన న్యాయపూరిత డిమాండ్లను ముఖ్యంగా ప్రతినెల మొదటి తేదీన వేతనాలు పెన్షన్లను ఇవ్వాలని పిఆర్సి కమిటీని ప్రకటించి అయ్యార్ ప్రకటించాలని మిగతా డిమాండ్లను సత్వరమే ప్రకటించడంలో ప్రభుత్వ తీరు మారకుంటే ఇదే ఫలితాలు మున్ముందు కూడా చవిచూడవలసి వస్తుందని విషయాన్ని గ్రహించాలని ప్రభాకర్ హెచ్చరించారు స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కొరకు ప్రభుత్వానికి యుదరగోట్టే సంఘాలకు ఇకనైనా కనువిప్పు కలుగుతుందని ఆయన ఆశించారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరూ సంతృప్తి పరంగా ఉండాలని ఇటీవలే సదరు నియోజకవర్గానికి సంబంధించిన ఒక మంత్రి చేసిన ప్రకటన సత్యదూరమైతే దానికి నిలువెత్తు నిదర్శనంగా వచ్చిన ఫలితం తన అభిప్రాయాన్ని ప్రకటించాల్సిందిగా ప్రబాకర్ డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking