సంగారెడ్డి మార్చ్ 17 ();సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహం ముందు ఈ(E) సెక్షన్ సూపర్డెంట్ గంగాధర్ దిష్టిబొమ్మను దహనం చేసిన ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ కోవూరి సత్యనారాయణ గౌడ్ ఆద్వర్యం లో దహనం చేసారు.ఈ సందర్బంగా సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో గల ప్రముఖ నాయకులు, సంఘసంస్కర్తలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మంత్రులు మరియు రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు స్వతంత్ర సమరయోధుడు కోవూరి మొగలయ్య గౌడ్ కుటుంబానికి కేటాయించిన 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా ఇప్పించి పట్టా పాస్ బుక్కులు మంజూరు చేసి న్యాయం చేయాలని సానుకూలంగా స్పందించిన కూడా ఇట్టి విషయంలో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఈ(E) సెక్షన్ సూపర్డెంట్ గంగాధర్ స్వతంత్ర సమరయోధుడి విషయంలో దేశభక్తి భావం లేకుండా సంఘ విద్రోహిగా సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో స్వతంత్ర సమరయోధుడు సమస్య పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి అధికారులు ఎవరైనా సరే వారిని శిక్షించే బాధ్యత జిల్లా కలెక్టర్ దని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ విజ్ఞప్తి చేశారు. ఇట్టి విషయంలో తక్షణమే న్యాయం జరగకుంటే రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉద్రిక్త చర్యలు చేపడతామని , ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని ఫ్రీడమ్ సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా బీసీ నాయకులు గొల్లగూడెం శంకర్ గౌడ్, మౌలానా, జగదీశ్వర్, రాధాకృష్ణ ,కిషన్, మహేష్ మరియు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు