ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 26 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం చందారం గ్రామంలో శ్రీ ప్రసన్న అంజనేయ సీతారామ సమేత ఆలయంలో పుష్కర ప్రయుక్త బ్రహ్మోత్సవాలు వేద పండితుల చే కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఆరు రోజులుగా నిర్వహించు ఈ కార్యక్రమాని భక్తులు అధికసంఖ్యలో పాల్గొంటున్నారు.
ఆలయ నిర్మాణం నేటికీ 12 సంవత్సరాలు పూర్తి కావడంతో పుష్కర బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.నేటికీ ఆరవ రోజు కావడంతో బుధవారం బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వరుడు రాముని తరపున మిర్యాల అగమా రావు- గిరిజ దంపతులు, సీత వదువు తరపున వంగపెళ్ళి పూర్ణచంద్రరావు-స్వర్ణ దంపతులు,వేద పండితుల మధ్య కళ్యాణం కన్నుల పండుగగా జరుపుకున్నారు. ఈ కళ్యాణంలో మిర్యాల కిషన్ రావు- కమలాదేవి, అనుమాల వేణు-పద్మ,గౌరెల్లి రవీందర్ రావు- కల్పన, మధుకర్ రావు-మాదవి,నవీన్ రావు-నిహరిక,ప్రభాకర్ రావు-లక్ష్మీ కళ్యాణంలో పాల్గొన్నారు.శ్రీ సీతారాముల కళ్యాణం తిలకించడానికి భక్తులు అధికసంఖ్యలో పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.అనంతరం వంగపెళ్ళి పూర్ణచంద్రరావు దంపతులు 1000 మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు.ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ప్రాతఃకాలారాధన,అర్చన,సేవా కాలము,నివేదన,శాత్తుమొఱు,శాంతి పాఠం,తీర్థ ప్రసాద గోష్టి వైభవంగా జరుతున్నాయి. చతుస్థానార్చన,మూల మంత్ర హోమములు,శ్రీ సుదర్శన ఇష్టి కూడా జరుపుకున్నాం గురువారం నాడు నివేదన,పూర్ణాహుతి,బలి ప్రధానం,శాత్తు మొఱు,తీర్థ ప్రసాద గోష్టి నిర్వహిస్తున్నామని ఆలయ వ్యవస్థాపక సభ్యులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాల అగమ రావు-గిరిజ, కిషన్ రావు ,వినోద్ రావు, వంగపెళ్ళి పూర్ణచంద్రరావు, సర్పంచ్ జయంత్,ఎంపిపిఅన్నం మంగ- చిన్నన్న,అనుమాల వేణు,రవీందర్ రావు,సత్యనారాయణ,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.