కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించాలి
జనాభా గణానలో బీసీలకు కులగలను చేపట్టాలి
దేశవ్యాప్తంగా ఉద్యమానికి రాజ్యసభ సబ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపు
గుంటూరు ఏప్రిల్ 26 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );పార్లమెంటులో బిసి బిల్లు పెట్టి చట్టసభల్లో బిసి లకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించాలని డిమాండ్ దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సబ్యులు ఆర్ కృష్ణయ్య తెలిపారు. బుధవారం గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ యువత అధ్యక్షులు గూడూరు నాని అధ్యక్షత వహించారు. 5 వేలకు పైగా హాజరైన ఈ సదస్సులో స్థానిక శాసనసభ్యులు ముస్తఫా, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసి చైర్మన్ నీల వెంకటేష్ ,ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు వరప్రసాద్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్బంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారంలో వాటా కోసం జరిగే ఈ మహాధర్మా పోరాటంలో బీసీలందరూ పార్టీలకతీతంగా పాల్గొనాలని పిలుపు నిచ్చారు. ఇక ముందు జరిగే బీసీల ఉద్యమం రాజ్యాధికారమే లక్ష్యంగా సాగుతుందన్నారు. బీసీల పేరు మీద ఏ సభ పెట్టిన, ఉద్యమం జరిగిన చట్టసభలలో రిజర్వేషన్ పెట్టాలనే లక్ష్యంగా సాగాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే జనాభా గణానలో బీసీలకు కులగలను చేపట్టాలని, పంచాయతీల సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుండి 52 శాతం పెంచాలని, రిజర్వేషన్లకు రాజ్యాంగ పద్ధతి కల్పించాలని, బిసి ఉద్యోగుల కు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలని ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని మొదలగు 15 డిమాండ్లను సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ కార్యక్రమంలో గూడూరు నాని, లాక వెంకట్రావు, నీల వెంకటేష్, అంగిరేకుల వరప్రసాద్, సి రాజేందర్, జి అనంతయ్య, మల్లికార్జున రావు, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking