ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 26 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ కాంతయ్య అధ్యక్షతన సాధారణ సమావేశం బుధవారం నిర్వహించారు.ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ…నూతనంగా వేయబడుతున్న ఎన్ హెచ్ 63 రోడ్డు పట్టణం నుండి వేయకుండా బైపాస్ రోడ్డు నిర్మించుటకు కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదించడం జరిగిందన్నారు. పలు అభివృద్ధి నిర్మాణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.అనంతరం మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ మాట్లాడుతూ… పార్కుల అభివృద్ధికి 15 లక్షలు, పారిష్యుద్ధ వాహనాల రిపేర్, వేసవి కాలం దృష్ట్యా పైప్ లైన్, బోర్ వెల్ మెటీరియల్ కొనుగోలు చేసి రిపేర్లు చేపించుటకు, ప్రెస్ క్లబ్ నూతన భవన్ రిపేర్ కొరకు 2 లక్షలు కౌన్సిల్ చర్చించి ఆమోదించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమము లో మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్,కౌన్సిల్ సభ్యులు,కోఆప్షన్ సభ్యులు,మున్సిపల్ మేనేజర్ శ్రీహరి,రాజశేఖర్,మున్సిపల్ ఇంజనీర్ ఎం.శ్రుతి వర్క్ ఇన్స్పెక్టర్,ఎన్విాన్మెంటల్ ఇంజనీర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.