పోలీసులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రజలకు సేవ చేయడంలో నిర్మల్ జిల్లా పోలీసులు ముందుంటారని నిర్మల్ జిల్లా ఎస్పీ
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. పోలీసులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రజలకు సేవ చేయడంలో నిర్మల్ జిల్లా పోలీసులు ముందుంటారని నిర్మల్ జిల్లా ఎస్పీ. సిహెచ్.ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పిర్యాదుదారులు హాజరై సమస్యలను ఎస్పీకి తెలియజేసి అర్జిలను సమర్పించారు, వారికి అప్యాయంగా పలకరించి ఓపిగ్గా సమస్యలను తెలుసుకొని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.ప్రజలు సమస్యలతో పోలీసు స్టేషన్ వచ్చినప్పుడు తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా చేసినప్పుడే ప్రజలకు పోలీసులపై నమ్మకం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు కూడా పోలీసులకు సహకారం అందించాలని, అనుమాస్పదన వ్యక్తులు కనబడినా, సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని దృష్టికి వస్తే వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేయాలి లేదా జిల్లా వాట్సప్ నెం.8712659599కు సమాచారం తెలియజేయాలని అన్నారు.