బోగస్ ఓట్లకు కేరాఫ్ పువ్వాడ

ఇప్పటికే రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు

కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యులు మువ్వా విజయబాబు

42వ డివిజన్, రాంక్యా తండాలో గడప గడపకు కాంగ్రెస్

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 11 (ప్రజాబలం) ఖమ్మం బోగస్ ఓట్లకు కేరాఫ్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యులు మువ్వా విజయబాబు పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని 42వ డివిజన్ లో రఘునాథ పాలెం మండలం రాంక్యా తండాలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం సోమవారం జరిగింది గడపకు గడపకు మువ్వా తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు పర్యాయాలు దొంగ ఓట్లతోనే పువ్వాడ ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. మూడవ సారి అదేవిధంగా గెలవాలని చూస్తున్న పువ్వాడ గెలుపును ఖచ్చితంగా అడ్డుకుంటామన్నారు. ఈ విషయమై ఇప్పటికే రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాలకు పువ్వాడ అజయ్ కుమార్ దొంగ ఓట్ల వ్యవహారంపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నేడో రేపో ఓటర్ల సమగ్ర జాబితా రానుందని వాటి వివరాలు పూర్తిగా పరిశీలిస్తామని అయినప్పటికీ పువ్వాడకు చెందిన దొంగ ఓట్లు ఉన్నట్లు ఆ జాబితాలో తేలితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మలీదు జగన్, ఎం.డీ. ముస్తాఫా, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ ఛైర్మన్ బాణాల లక్ష్మణ్, మైనారిటీ నాయకులు షేక్ ఇమామ్, దుంపల రవి కుమార్, బోడా శ్రావణ్ కుమార్, చింతమళ్ల గురుమూర్తి, కీసర పద్మజా రెడ్డి, శ్రీ కళా రెడ్డి, నరసింహారావు, కాంపాటి వెంకన్న, రాము తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking