పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యనిర్వాక ఇంజనీర్ విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 11 (ప్రజాబలం) ఖమ్మం జెడ్పీ కార్యాలయ ప్రాంగణంలో  పంచా యతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం కార్యనిర్వహక ఇంజనీర్ విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ డివిజన్ కార్యాలయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం ప్రారంభించారు పంచాయతీ రాజ్ శాఖ పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లాకు కార్యనిర్వాహక ఇంజనీర్, విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ డివిజన్ కార్యాలయం మంజూరు అయినట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఇంచార్జ్ విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఈఈ శ్రీనివాస్ కి మంత్రి అభినందనలు తెలుపుతూ శాలువాతో సన్మానించి సీట్లో కూర్చోబెట్టారు జిల్లాకు మెరుగైన సేవాలందిం చాలని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర రావు సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్  జెడ్పి సిఇఓ అప్పారావు, పంచాయతీ రాజ్ ఎస్ఈ రాంచంద్ర మౌళి ఈఈ కెవికె శ్రీనివాస్ రావు డిఈ కోటేశ్వరరావు వెంకట్ రెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking