అర్జీదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సత్వర చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 11 (ప్రజాబలం) ఖమ్మం సోమవారం నూతన కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ‘‘గ్రీవెన్స్‌ డే’’లో అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి తగు చర్య నిమిత్తం సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వైరా మండలం కొండవనమాల గ్రామంకు చెందిన దుంపల నిరోష, తనకు 14 సంవత్సర ముల నుండి ఫిడ్స్‌ రావడం పనికి వెల్లిన చోట పడిపోవడం జరుగుతున్నదని, తాను సదరం క్యాంపుకు వెళ్లడం జరిగినదని, సర్టిఫికే జారీ చేయబడలేదని సమర్పించిన దరఖాస్తును, తల్లాడ మండలం వెంగన్నపేట గ్రామంకు చెందిన బోడ వెంకటేశ్‌ తన చిన్నతనంలోనే తల్లిదండ్రు చనిపోయినారని, మతిస్థిమితం లేకుండా జీవితం గడుపుచున్నానని, సదరం క్యాంపులో వందశాతం వైకల్యంతో సదరం సర్టిఫికేట్‌ ఇవ్వడం జరిగినదని, అట్టి సర్టిఫికేట్‌ రెన్యువల్‌ నిమిత్తం మీసేవా సెంటర్‌కు వెలితే రిజెక్టు అవుతున్నదని అట్టి సర్టిఫికేట్‌ను రెన్యువల్‌ చేయించి పింఛను మంజూరు చేయగలరని సమర్పించిన దరఖాస్తులను జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. సింగరేణి మండలం ఉసిరికాయ లపల్లి గ్రామ భూనిర్వాసితులు తాము సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్టు నిమిత్తం సర్వేనెం.548/142, 548/95 కోల్పోయి ఉన్నామని అట్టి భూమికి సంబంధించి ల్యాండ్‌ లూసర్‌ సర్టిఫికేట్‌ ఇప్పించ గలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం రెవెన్యూ డివిజనల్‌ అధికారికి ఆదేశించారు. మధిర మండలం మాటూరు గ్రామంకు చెందిన ఉమాసరస్వతి మాటూరు గ్రామం రెవెన్యూ సర్వేనెం.35/ఆ/అలో 0.60 సెంట్లు భూమిని పెద్దనాన్న గారి వద్ద 2015 సంవత్సరంలో క్రయం పొందినానని, అట్టి భూమి ధరణిలో మిస్‌ అయినదని అట్టి భూమిని ధరణిలో చేర్చి పాసు పుస్తకము ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును, దానబోయిన చలపతిరావు తనకు మాటూరు రెవెన్యూ సర్వేనెం.35/ఆ/ఆలో 0.571/2 సెంట్లను తన అన్నగారి వద్ద నుండి క్రయం పొందినానని, అట్టి భూమిని ధరణిలో ఆన్‌లైన్‌ చేసి నెంబర్‌ ఎక్కించగలరని సమర్పించిన దరకాస్తును కొణిజర్ల మండలం తనికెళ్ళ గ్రామంకు చెందిన యస్‌.సైదులు తాను తుమ్మలపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వేనెం.0.1875 ఎకరం పై గల భూమిని డేరంగుల నాగేంద్ర వద్ద కొనుగోలు చేయడం జరిగినదని అట్టి భూమిని సాధాబైనామాలో రిజిస్ట్రేషన్‌ పాసుపుస్తకంకు అప్లై చేయడం జరిగిదని, 13`మి ఫాం వచ్చినదని, దానికి సంబంధించిన పాసుపుస్తకము ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం కలెక్టరేట్‌ ధరణి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఏన్కూరు మండలం రాజలింగాల గ్రామంకు చెందిన బండి యాదగిరి తనకు ఫించను మంజూరు అయినదని అట్టి ఫించను తన ఖాతాలో జమ కాలేదని తాను అనారోగ్యంతో బాదపడుచున్నానని పింఛను ఇప్పించి ఆదుకోగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డిపిఎంను, మండల అభివృద్ధి అధికారిని ఆదేశించారుఅదనపు కలెక్టరు డి.మధుసూదన్‌ నాయక్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, జిల్లా స్థాయి అధికారులు తదితరులు ‘‘గ్రీవెన్స్‌ డే’’లో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking