ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 11 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని ఉప కార్య నిర్వాహాక అభియంత (పీ ఆర్ సబ్ డివిజన్ ) కార్యాలయాన్ని సోమవారం మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…ప్రజలకు పంచాయతీ రాజ్ శాఖ నుంచి మరిన్ని మెరుగైన సేవలు అందించడానికే పట్టణంలో కార్యాలయంను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.
రీ ఆర్గనైజెషన్ లో భాగంగా పీ ఆర్ ఇంజనీరింగ్ మండలాల,పట్టణ పరిధిలో ఎలాంటి సమస్యలు తలెత్తిన సంబంధిత అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని దీనిలో భాగంగానే పాలనలో పలు సంస్కరణలు తీసుకువచ్చినట్లు వివరించారు.అధికారులకు కార్యాలయం అందుబాటులోకి రావడం వలన రైతులకు,ప్రజలకు అన్ని రకాల సేవలు త్వరగా అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్,ఎంపీపీ అన్నం మంగ,జడ్పీటీసీ ముత్తే సత్తయ్య,పీఆర్ఎస్ ఈ వెంకట్రావ్,డిప్యూటీ ఆర్ ఈ జాదవ్ ప్రకాష్,డీఈ ఈ హరీష్,ఎంపీడీఓ నాగేశ్వర్ రెడ్డి,ఏఈలు శృతి,సుబ్బా రెడ్డి,విక్రమ్ రెడ్డి,జె టీ ఓ సాయజుద్దీన్ తో పాటు జన్నారం,దండేపల్లి, లక్షేట్టిపేట్ మండలాల సర్పంచ్ లు,కౌన్సిలర్లు, కాంట్రాక్టర్స్ పాల్గొన్నారు.