ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై సిపి రంగనాథ్ ప్రెస్ మీట్

 

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 24:

సైఫ్ కావాలనే ప్రీతిని వేధించినట్లు వాట్సప్ చాట్స్ ద్వారా తెలిసిందనీ వరంగల్ సిపి ఏవి రంగనాథ్ తెలియజేశారు. కేఎంసి పిజి మొదటి సంవత్సరం విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసుకు సంబంధించిన వివరాలను సిపి కార్యాలయంలో విరేఖరుల సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనస్తీషియా విద్యార్థిని ప్రీతి పట్ల సీనియర్ విద్యార్థి సైఫ్ టార్గెట్ గా వేధించినట్లుగా వాట్సప్ చాటింగ్ హిస్టరీ ద్వారా పోలీసులకు తెలిసిందని అన్నారు. సైఫ్ తన ఫ్రెండ్స్ తో కూడా ప్రీతి ఎక్కువ చేస్తున్నట్లు చెప్పాడనీ ప్రీతిని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ గ్రూపుల్లో మెసేజులు చేస్తూ ఉండటాన్ని గమనించిన ప్రీతి తనను ఎందుకు వేధిస్తున్నావంటూ మెసేజ్ కూడా చేసిందనే విషయం చాటింగ్ హిస్టరీలో తెలిసిందని అన్నారు.
ప్రీతి మానసికంగా ఇబ్బంది పడినందువల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందనీ ఆత్మహత్యా చేసుకోవాలని కోణంలో
సక్సీ నైల్ కోలిన్ అనే ఇంజక్షన్ గురించి గూగుల్ లో ప్రీతి సెర్చ్ చేసిందని ఆ ఇంజక్షన్ తన గదిలో కూడా దొరికిందని తెలియజేశారు.ప్రీతి బ్లడ్ శాంపిల్స్ తీశి ల్యాబ్ కు పంపించడం జరిగిందని టాక్సికాలజీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలియాల్సి ఉంటుందని అన్నారు.ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సైఫ్ వేధింపులే కారణంగా ప్రాథమికంగా నిర్దారించి నిందితుడిని అరెస్టు చేసి కోర్టు లో హాజరు పరచడం జరిగిందని పేర్కొన్నారు.
ఈ ఘటనకు ఎలాంటి రాజకీయ రంగుపులమొద్దు
సైఫ్ కు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదనీ అన్నారు.
పోలీస్ రియాక్ట్ కాలేదన్నది అవాస్తవం.పోలీసులను హెల్ప్ కావాలని తనకున్న సంబంధాలతో ఓరల్ గా అడిగారనీ ప్రీతి తండ్రిని అడిగితే పోలీస్ రియాక్ట్ అయ్యారని చెప్పారు.ర్యాగింగ్ అనేది ఇక్కడ చూడకూడదు.. బాసింగ్ అనేదే ఇక్కడ ప్రధానం అంశంగా ఉందని ఇది ఒక్కొక్కరి మనస్తత్వాన్ని బట్టి మారుతుందని అన్నారు ప్రతి విషయంలో సెన్సిటివ్ మనస్తత్వం వల్ల తనను అందరి ముందు అవమాన పరుస్తూ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాడని అనుకొని తీవ్ర నిరాశతో ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కేసు పై దర్యాప్తు మరింత లోతుగా నిర్వహిస్తున్నామని ఫస్ట్ ఇయర్ విద్యార్థులతో మాట్లాడి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని అన్నారు.
ఈ ఘటనలో పోలీస్ పరంగా ఎలాంటి నిర్లక్ష్యంగా వ్యవహరించలేదనీ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking