• ముధోల్ మండలం విఠోలి గ్రామంలో ఘటన
ఉసురు తీసిన ఉపాధి
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా… ముధోల్, ఫిబ్రవరి 24 :శనగలు పడుతుండగా ప్రమాదవశాత్తు ఒకరు నూర్పిడి యంత్రం (హల్లర్) లో పడి దుర్మరణం పాలయ్యారు, నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని విఠోలి గ్రామంలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి,మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మనీష్ (22) గత నెలలో ఇక్కడి ప్రాంతంలో ఉపాధి కోసం గాను అక్కడి ప్రాంతానికి చెందిన నూర్పిడి యంత్రంపై వచ్చాడు,ఇక్కడి ప్రాంతంలో నూర్పిడి యంత్రంపై శనగలు పడుతూ ఉపాధి పొందుతున్నాడు,ఇదే క్రమంలో శుక్రవారం ముధోల్ మండలంలోని విఠోలి గ్రామానికి చెందిన ఒక రైతుకు పోలంలో శనగలు పడుతుండగా ప్రమాదవశాత్తు నూర్పిడి యంత్రంలో పడి పోయాడు, క్షణాల వ్యవధిలోనే మనీష్ అందులో చుట్టుకపోయి దుర్మరణం పాలయ్యాడు, ముథోల్ పోలీసులు ఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు*.