అఖిల బారత గో సేవ ఫౌండేషన్ అధ్వర్యంలో గోదానం.

ప్రతి దేవాలయంలో గోవులు ఉండాలని గుడికో గోమాత కార్యక్రమం మరియు ప్రతి పేద రైతుకు గో అధారిత వ్యవసాయం కోసం ఆవులను, నందులను ఉచితంగా ఇవ్వాలని సంకల్పంతో అఖిల బారత గోసేవ ఫౌండషన్ అధ్వర్యంలో సైదాబాద్ కాలనీ రామాలయం గోశాల శ్రీ గోవర్థన్ రెడ్డి గారి సహకారంతో ఈ రొజు మధ్యాహ్నం చైతన్యపురి అయ్యప్ప భక్త సమాజం వారికీ గోవును దానం గా ఇవ్వడం జరిగింది.
ప్రతి దేవాలయముకు వచ్చే భక్తులకు గోవును పూజించుకునే బాగ్యన్ని కల్పించే విధంగా ఆలయ నిర్వాహకులు ఎర్పాటు చేయలని దానికి అఖిల భారత గోసేవ ఫౌండషన్ ఆధ్వర్యంలో ఉచితంగా గోవును ఇస్తామని అధ్యక్షులు బాల క్రిష్ణ గురుస్వామి తెలియ చెసారు.
ఈ కార్యక్రమంలో బాల కృష్ణ గురుస్వామి తో పాటు , చంద్ర స్వామి,గోవర్ధన్ రెడ్డి , శ్రీనివాస గౌడ్ ,బొర్రా ప్రవీణ్ రెడ్డి , చైతన్య పురి అయ్యప్ప భక్త సమాజం ప్రతినిదులు ప్రభాకర్ రెడ్డి , బాపి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking