ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 24 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కోణిజర్ల మండలం అమ్మపాలెం గ్రామంలో ఆనారోగ్యంతో బాధపడుతున్న తేజావత్ రామచంద్రుని కుటుంబనికి గ్రామానికి చెందిన ఎంఎంకేఈ ట్రస్ట్ తరుపున చైర్మన్ షేక్ గాలిబ్ పాషా ఐదువేల రూపాయలు నగదు తో పాటు 25 కేజీల బియ్యం నిత్యవసరాలు అందించారు.ఎంఎంకేఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామంలో మండలంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ గాలిబ్ పాషా ట్రస్ట్ సభ్యులు రంజాన్ ఆలీ బాబు సాహెబ్ హుస్సేన్ సాహెబ్ బీఆర్ యస్ నాయకులు తేజావత్ రామ్మూర్తి బానోత్ రవి తేజావత్ కోటి గుగులోతు కృష్ణమూర్తి మానిగే రామకృష్ణ పవన్ రవి పుష్పావతి తదితురులు పాల్గోన్నారు.