ఫిబ్రవరి 8 , 9 తేదిల్లో ఛలో ఢిల్లీ – పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన పోస్టర్ ఆవిష్కరించిన ఆర్. కృష్ణయ్య

హైదరాబాద్ ఫిబ్రవరి 4 : బి.సి లకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి డిమాండ్ చేస్తూ పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన జరపాలని రాజ్యసభ జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ఈనెల 8 మరియు 9న చలో ఢిల్లీ కార్యక్రమం సందర్భంగా బీసీ భవన్ నందు జాతీయ బీసీ సంక్షేమ సంఘ ఉప అధ్యక్షులు గుజ్జ సత్యం అధ్యక్షతన పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ – పార్లమెంట్ ఎన్నికలలో బి సి లకు అన్ని రాజకీయ పార్టీలు బి సి లకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని కోరారు. బి.సి లకు అన్యాయం చేసే పార్టీల బరతం పడతామని హెచ్చరించారు.అన్ని రాజకీయ పార్టీలు బి సి లను ఓటు బ్యాంకు గా వాడుకుంటున్నారు. రాజ్యాధికారంలో వాట ఇవ్వకుండా 75 సం.లుగా అన్యాయం చేస్తూన్నారు. జెండాలు మోసుకుంటు, జిందాబాద్ ల నినాదాలు ఇస్తూ బిసిలను వాడుకుంటున్నారని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking