లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా మాతృభాషా దినోత్సవ వేడుకలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 21 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం అధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశానికి తెలుగు విభాగం అధ్యక్షురాలు డా. శ్రీలత అధ్యక్షత వహించగా కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డా, గంగయ్య ముఖ్య అతిథిగా పాల్గొని .ఈ సందర్భంగా డా, గంగాయ్య మాట్లాడుతూ… మాతృభాషలో మాత్రమే సంపూర్ణ భావప్రకటనకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు,భాషల మనుగడ ప్రమాదం స్థాయిలోకి వెళ్ళకుండా కాపాడుకోవాలని పిలుపు నిచ్చారు,తెలుగు భాష వాడకం పైన ఇప్పటి తరానికి సరైన దిశా నిర్దేశం చేయవలసిన అవసరం ఉన్నదని తెలిపారు.అధ్యక్షురాలు డా. శ్రీలత మాట్లాడుతూ….తెలుగు భాషలో ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు, మాతృభాషలో అమ్మతనం ఆత్మీయత ఉంటుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మాతృభాషా ప్రచారంపై విద్యార్థులకు నిర్వహించిన వీడియో పోటీలలో ఉత్తమమైన వీడియోలను ప్రదర్శించడం జరిగింది.కార్యక్రమంలో తెలుగు విభాగం అధ్యక్షురాలు డా,శ్రీలత అద్యాపకులు డా.సురేష్,డా,హరీష్, డా,రాజ్ కుమార్,కుమారస్వామి, సవిత,మంజుల,రాజ్ కుమార్, శ్రీనివాస్,సంద్యా రాణి, కవిత,మల్లయ్య,మహేష్ కుమార్, రాయలింగు,రవీందర్,రమణ, సత్యనారాయణ బోధన,బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking