అంబేద్కర్ విగ్రహంపై నిర్లక్ష్యం వీడాలి సుందరి కరణ పనులను వెంటనే చేపట్టాలి దళిత సంఘాల డిమాండ్

 

జగిత్యాల, ఫిబ్రవరి 21,(ప్రజాబలం ప్రతినిధి): అంబేద్కర్ జయంతి సాక్షిగా ఇచ్చిన హామీని మంత్రి ఇతర నేతలు విస్మరించారని, అంబేద్కర్ విగ్రహ సుందరికరణ పనులను చేపట్టి చిత్తశుద్ధిని చాటుకోవాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలోని ఇందిరాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాలను సుందరికరణ చేపట్టారన్నారు. గత అంబేద్కర్ జయంతి సాక్షిగా మంత్రి తోపాటు మరికొందరు నేతలు అంబేద్కర్ విగ్రహాన్ని సుందరికరణ చేపడతామని హామీ ఇచ్చి విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తహసిల్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహం పక్కన ఉన్న సిగ్నల్ లైట్లు తొలగించాలని లేని పక్షంలో వెయ్యి మందితో ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో
మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కన్వీనర్ దుమాల గంగారాం,
మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చిత్తారి ప్రభాకర్,
మహాజన సోషలిస్టు పార్టీ
కో కన్వీనర్ బెజ్జంకి సతీష్,
ఎమ్మార్పీఎస్ జగిత్యాల జిల్లా కన్వీనర్ సురుగు శ్రీను(జగన్),
మహాజన సోషలిస్టు పార్టీ జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జి బొనగిరి కిషన్
మాల మహానాడు మండల కార్యదర్శి పుట్ట గంగాధర్,
రెగుంట గంగాధర్,
జనసేన పార్టీ జగిత్యాల నియోజకవర్గ కో ఆర్డీనేటర్ బెక్కం జనార్ధన్, బోల్లి రామ్,
దుమాల పెద్ద గంగారాం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking