నకిలీ డెత్ సర్టిఫికెట్ జారీ కేసులో రెవెన్యూ గిర్దావర్ నాగేష్ తో సహా నలుగురి అరెస్ట్

 

మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా ముఖ్యమంత్రి నియోజకవర్గం తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన ఒక రైతు బతికుండగానే చనిపోయినట్లు మరణ ధ్రువపత్రాన్ని జారీచేసి అతని పేరిట ఉన్న భూమిని ఇతరులు పేరిట పట్టా మార్పిడి చేసిన కేసులో తూప్రాన్ మండల తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ చింతల నాగేష్ తో పాటు నలుగురు వ్యక్తులను ఫోర్జరీ, చీటింగ్ కేసుల కింద అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తూప్రాన్ ఎస్ఐ సురేష్ కుమార్ తెలిపారు. మండల తహసీల్దారు జ్ఞాన జ్యోతి, బాధితుడు తొంట మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నకిలీ ధ్రువ పత్రాలు జారీ చేసిన ఆర్. ఐ నాగేష్, భూమిని మార్పిడి చేయించుకున్న తొంట యాదయ్య, అతని కొడుకు నర్సింలు, తోట మహేష్ అనే నలుగురినీ అరెస్టు చేసిననట్లు ఎస్సై పేర్కొన్నారు. వెంకటాయపల్లి గ్రామానికి చెందిన తోంట మల్లేశం అనే వ్యక్తికి ఆ గ్రామ శివారులో రెండు చోట్ల పన్నెండున్నర గుంటల భూమి ఉంది. అయితే మల్లేశం జీవ నోపాధి కోసం గ్రామం వదిలి వేరే ప్రాంతంలో నివాసం ఉంటు న్నాడు. ఇదే అదనుగా భావించిన అతని కులస్తాడు తొంట యాదయ్య అనే వ్యక్తి మల్లేశం పేరిట ఉన్న భూమిని కాజేయడానికి రెవెన్యూ అధికారులతో కలిసి పథకం పన్నారు. బతికి ఉన్న మల్లేశం అనే వ్యక్తి చనిపోయినట్లుగా రెవిన్యూ అధికారులే పంచాయతీ కార్యదర్శి జారీ చేసినట్లుగా ఫోర్జరీ పత్రాన్ని
తయారుచేసి దాని ఆధారంగా పంచనామా పత్రాన్ని రూపొందించి. నకిలీ డెత్ సర్టిఫికెట్ ను జారీ చేశారు. దీని ఆధారంగా యాదయ్య కు మల్లేశం పేరుతో ఉన్న భూమిని మార్పిడి చేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న అసలు పట్టాదారు మల్లేశం కుటుంబ సభ్యులతో కలిసి మండల కార్యాలయానికి వెళ్లి గొడవ చేశాడు మండల తహసిల్దారును నిలదీశారు. బాధితులు గొడవతో అసలు బాగోతం బయటపడడంతో మండల తహశీల్దార్ జ్ఞాన జ్యోతి ఫోర్జరీ ధృవపత్రాల జారీ అయిన విషయంపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలని తూప్రాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు బాధితుడు. తొంట మల్లేశం కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు..

ఈ రెండు ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరపగా రెవెన్యూ అధికారులే ధ్రువపత్రాలను సృష్టించినట్లు బయటపడింది. దీనితో రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగేష్ తోపాటు మరో ముగ్గురిపై ఫోర్జరీ, చీటింగ్ కేసుల కింద అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇలాంటి భూ రికార్డుల తారుమారు సంఘటనలు ఇటీవల కాలంలో తూప్రాన్ మండల తహశీల్దారు కార్యాల యంలో గుట్టుచప్పుడు కాకుండా. జరిగిపోతున్నాయి. ఎందరో అమాయకులు రెవెన్యూ అధికారుల అక్రమాలకు మాయాజాలానికి బలీఅవుతున్నారని బహిరంగ రహస్యం. మోసపోతున్నారన్న విషయం తాసిల్దార్ మండల కార్యాలయంలో బట్ట బయలు అవుతున్నది.

Leave A Reply

Your email address will not be published.

Breaking